jajimoulali

Jajimogulali Lyrical Song | Rudrangi Movie | Jagapathi B,Mamta Mohan D, Divi | Nawfal Raja Ais

Song Info

♪Song Jajimogulali8
♪Album/Movie Rudrangi
♪Artist Jagapathi Babu
Divi Vadthya
Mamta Mohan Das
Vimala Raman
Ashish G
hi
Ganavi Laxman
♪Singer Mohana Bhogaraju
♪Music Nawfal Raja Ais
♪Lyrics Abhinaya Srinivas
♪Choreography Bhanu Master

“jajimoulali” Song Lyrics

యేయ్..
వచ్చిందే వచ్చిందే
తయ్యారై వెన్నెల
వయ్యారి.. ఓ.. పోరీ

పుట్ట మీద.. పాల పిట్ట
జాజిమొగులాలి
ముట్ట బోతే.. తేలు కుట్టే
జాజిమొగులాలి

పుట్ట మీద.. పాల పిట్ట
జాజిమొగులాలి
ముట్ట బోతే.. తేలు కుట్టే
జాజిమొగులాలి

మంత్రమేసే మామా కొడుకా
జాజిమొగులాలి
మందు దంచుకొని రారా
జాజిమొగులాలి

పుట్ట మీద.. పాల పిట్ట
జాజిమొగులాలి
ముట్ట బోతే.. తేలు కుట్టే
జాజిమొగులాలి

పెరువెట్టి ప్రేమతోటి
పిలువంటడే..
వాడు ఇగురంగ ఈశార
జేస్తనంటడే..

ఏలుబట్టి నలుగుట్ల
నడువంటాడే..
వాడు యేమి
ఎరుగనంటూ యెన్ని
వగలబడుతడే

ఒక్కదాన్ని దొరికితే
వాడు వదలంటాడే
నన్ను బక్క
పలుస గున్నవంటు
లెక్కలేస్తాడే

తిక్క తిక్క పనులెన్నో
జెయ్యమంటడే
వాడు పక్కనుంటే
జాలు నాకు ఉడుకపోతలే
ఇస్సుంటా.. రమ్మంటే
నా యింటిదానివంటదే

ఆకురాయి సూపులోడే
జాజిమొగులాలి
అందమంత మెరుగుబెట్టి
జాజిమొగులాలి
వాడుజూసే సూపులకు
జాజిమొగులాలి
కన్నె తనమే.. కరిగిపాయె
జాజిమొగులాలి

యే.. అర్ధరాత్రి
యదికోస్తే.. నిద్రృండదే
వాడు ముద్దు మీద ముద్దుబెడితే
పొద్దుబూడువదే..
అమ్మ తోడు.. పాడు మనుసు
ఆగనంటదే..
నాకు వాని మీద
పాణమంతా.. గుంజుతుంటదే

రాక రాక.. వచ్చినాడు
మొన్న రాతిరే..
నా రామసక్కనైన బావా
సాటి ఎవ్వరే..
కోరి కోరి.. పెట్టిననాడు
కొత్త కిరికిరే..
వాడు అదుముకుంటే
ఆడనందీ.. ఉన్నా ఊపిరే
నా తోడే వాడుంటే..
ఇగ మస్తు.. మస్తుగుంటదే

గూడెపోళ్ల.. పిల్లగాడే
జాజిమొగులాలి..
గుండె కొల్లగొట్టినదే
జాజిమొగులాలి..
కన్ను కన్ను.. కన్నుగలిపేనంటే
జాజిమొగులాలి..
యెన్నులోనా..వణుకుబుట్టే
జాజిమొగులాలి..

దొరసాని.. నవ్వులు జూడే
జాజిమొగులాలి..
పున్నమోలే.. బూసినాయె
జాజిమొగులాలి..
తీగ నడుము జూడబోతే
జాజిమొగులాలి..
నాగుబాము లెక్క ఊగే
జాజిమొగులాలి..
యేయ్…

“jajimoulali” Song Video

rudrangi

Rudrangi Lyrical Title Song | Rudrangi Movie | Jagapathi Babu | Kailash Kher | Nawfal Raja Ais

Song Info

♪Singer Kailash Kher
♪Chorus Vikram Pitty
Abhijith
Aravind
Charu
Anu
Lavanya
♪Lyricist Manukota Prasad
♪Music Director Nawfal Raja Ais
♪Musicians
♪Live Rytham Karthik Vamsi
♪Mandolin Babu
♪Strings Balaji Group

“rudrangi” Song Lyrics

త్యాగాలే నిను తలచి తలవంచి
మొక్కేమే మా తల్లి నీకమ్మా

నవ్వేటి పువ్వులే గోసరిల్లి
వసివాడి పోయెనే మాయమ్మా
హృదయాల్లో వెలిగేటి వెలుగు నీవై
వెలసినావే తల్లి ఓయమ్మా హా

సెరువంతా మనసే నీది తల్లి
ఆ సెరువుకే సేదోడు నడక నీది
నీ ఋణము మీమెట్ల తీర్చగలమే
ఏ జన్మకు తీరదే మాయమ్మా

వేకువ నీవై వెలుగు పంచె
పయనాన్ని కడితివే ఓయమ్మా
ఓ ఓ ఓఓ

గుండెలే మండే మండే
ఏ జన్మల శాపమే
గొంతులే ఎండిపోతే గంగవైనావులే
మముకన్న మా ఈ ఊరికే
తల్లివే నీవైనావులే
కొలిచేటి దైవమా బండలోన
కొలువై లేదే ఓయమ్మా
ఆ ఆ ఆ ఆ ఆ

బాంచన్ బతుకుల్లో మెతుకై
త్యాగాల బోనమై కదిలినావే
కొండంత బాధను మింగి
నిండు కడలల్లే నిలిచినావే

నీ గుండె మాటున దుఃఖమంతా
మా గొంతు తడుపుటకేనమ్మా
నీ ఒడిలో పసికూనలైనామే
మా అమ్మవై అడుగులు వేస్తున్నవే
ఓ ఓ హో హో ఓ

రుద్రంగి రుద్రంగి రుద్రంగి
రుద్రంగి రుద్రంగి రుద్రంగి
రుద్రంగి రుద్రంగి రుద్రంగి

“rudrangi” Song Video