dosthulam

Dosthulam Video Song | Mem Famous | Sumanth Prabhas | Kaala Bhairava | Kalyan Nayak

Song Info

Writer & Director Sumanth Prabhas
DOP Shyam Dupati
Editor Srujana Adusumilli
Music Kalyan Nayak
Sound Designer Nagarjuna Thallapalli
Sync Sound V. Swapnik Rao
Executive Producer Surya Chowdary
Art Director Aravind Muli

“Dosthulam Song” Song Lyrics

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం

చిన్ననాటి నుండి
జ్ఞానపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వాన తాకినట్టు
ఈ కాలం కూల్చెనా

మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటు
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టె
ఈ బాధే లోతునా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాధలోను ఉంటేనే దోస్తులురా
మాది కాదు బాధనుకుంటే
స్నేహం ఉండదురా

తప్పుల్లోను నీతోనే ఉన్నామురా
గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
చెప్పలేని బాధే ఉన్నా
చెయ్యే వదలమురా

నీతో ఉంటూ మాటలు రాని
మౌనం చూడకురా
మౌనం వెనకే మాటలు కలిసిన
భాదుందిరా లోపల

స్నేహంలోన కోపాలన్నీ
కరిగే మేఘాలురా
స్నేహం అంటే ఎపుడు ఉండే
ఆకాశమే కదరా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

కళ్లలోకి కన్నీరు రాగానే
మాట కొంచం తడబడుతుండగనే
ఏమయ్యింది మామా అంటూ
అడిగె గొంతువిరా

నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
నువ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు
నువ్వు దూరం పోవాలన్నా

నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్నా
వద్దు అంటూ ఆ క్షణాన్ని
ఏడుస్తు ఆపనా

గమ్యం చేరే పయనాన్నీ
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమే మాకు లేదు

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం

“Dosthulam Song” Song Video

minimum

Minimum Song | Mem Famous | Sumanth Prabhas | Rahul Sipligunj | Chai Bisket Films|Lahari Films

 Song Info

Writer & Director Sumanth Prabhas
DOP Shyam Dupati
Editor Srujana Adusumilli
Music Kalyan Nayak
Sound Designer Nagarjuna Thallapalli
Sync Sound V. Swapnik Rao
Executive Producer Surya Chowdary
Art Director Aravind Muli
Costume Designer Rekha, Shiva Naidu
Publicity Designer Ananth Kancherla

“Minimum” Song Lyrics

ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము
ఏదో లొల్లి జేసేదాక
మేము గమ్మునుండము
దావత్తు బారతుల్ల ఊగుతుంటము
మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము

పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము
పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము
మందికాడ మాటల్లో రెచ్చిపోతము
మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము

మేమంతా చిల్లు రా
లైఫ్ అంతా చిల్లురా
మాతోటి వెట్టుకుంటే
గిప్ప గిప్ప గుద్దుడేరా
వద్దురా వద్దురా
మమ్మల్ని గెలకొద్దురా

మాతోటి మినిమమే మినిమమే
మినిమమే చల్
అరె క్రికెట్ లా మినిమమె
మినిమమే మినిమమే చల్

మాతోటి మినిమమే
మినిమమే మినిమమే
క్రికెట్ లా మినిమమే
మినిమమే మినిమమే

ఆటాడితే మినిమమే
మినిమమే మినిమమే
డైలాగేస్తే మినిమమే
మినిమమే మినిమమే చల్

నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే
ఇడ్లీ వడ ఏదీ లేదు
ఫస్ట్ ఫస్ట్ ఛాయే

మామ రోజు వంద పెట్రోలు
గల్లి గల్లి తిరుగుడే
అన్ని చోట్ల ఖాతాలే
జీవితంలో కట్టేద్ లే

బీరు రేటు పెరిగితే
బాధ పడుత తాగుతాం
బాధ గిట్ల పెరిగితే
రెండెక్కువ తాగుతాం

గెలికింది ఎవ్వడని
చిట్టి మొత్తం తీస్తాం
కొట్టాలనిపించినోడ్ని
దవడ పగలగొడతాం

వద్దురా వద్దురా
ఊరమాస్ గ్యాంగ్ రా
స్కెచ్చేసి పంచిస్తే
ఆగమై పోతవ్ రా
వెళ్లిపో వెళ్లిపో
మేంకొడితే ఫేమసైతవ్

డిస్టెన్స్ మినిమమే
మినిమమే మినిమమే ప్లీజ్
అరె మాతోటి మినిమమే
మినిమమే మినిమమే ప్లీజ్

“Minimum” Song Video

galli chinnadi

Galli Chinnadi Song | Mem Famous | Goreti Venkanna | Sumanth Prabhas | Kalyan Nayak

Song Info

Producers Anurag Reddy
Sharath Ch
ra
Ch
ru Manoharan
Writer & Director Sumanth Prabhas
DOP Shyam Dupati
Editor Srujana Adusumilli
Music Kalyan Nayak
Sound Designer Nagarjuna Thallapalli
Sync Sound V. Swapnik Rao
Executive Producer Surya Chowdary
Art Director Aravind Muli
Costume Designer Rekha, Shiva Naidu
Publicity Designer Ananth Kancherla

“galli chinnadi” Song Lyrics

గల్లీ చిన్నది… గరీబోళ్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇండ్లు… కిళ్ళీ కొట్ల కన్నా సిన్నగున్నవి
గల్లీ చిన్నది… ||2||

ఆ ఇండ్లకన్న మేలురా… ఫలకునామ బండ్లు రా
పాత రైలు డబ్బలోలె… పడాఉన్నవేందిరో
గల్లీ చిన్నది… ||గల్లీ||

తుమ్మై కడుపలూ… తుప్పు పట్టిన సిలుకులు
పుచ్చుతోని తలుపులేమో… పెచ్చులూడి ఉంటయీ
గల్లీ చిన్నది… ||గల్లీ||

ఎత్తు మనిషి సుట్టమై… కొత్త ఇంటికొస్తే రా
పైన కడప తగిలి… నెత్తి బొప్పికట్టి పోతదో
గల్లీ చిన్నది… ||గల్లీ||

దరువాజలిరుకు దగ్గర… జరిపి కట్టుకుంటరో
లావుగున్న కోడి పుంజు… కూర కష్టమైతదో
గల్లీ చిన్నది… ||గల్లీ||

కలిగినోల్ల కాలనీల… వరద మురుగు నీల్లురా
వీల్ల నల్లపైపు తోనె… వియ్యమందుకుంటయో
గల్లీ చిన్నది… ||గల్లీ||

వెలుగుతున్న బలుబులా… వెలుతురెంత ఉందిరా
నూటిక్కొక్క ఇంట్ల కూడ… ట్యూబ్ లైటు లేదురో
గల్లీ చిన్నది… ||గల్లీ||

సెకండ్ హ్యాండ్ టీవీ రా… దాని శబ్దమేందొ చూడరా
లోటల రాల్లేసినట్టు… లొడలొడ వినిపిస్తదో
గల్లీ చిన్నది… ||గల్లీ||

ఇంటిక్కొక్క గాధ రా… విచారిస్తే బాధ రా
ఆ గాధలన్ని తెలుసుకుంటె… గుండె గావరైతదో
గల్లీ చిన్నది… ||గల్లీ||

పాత పంపు ఇనుప టెంకి… రోడ్డు మీద పెట్టుకోని
గాలి కొట్టె పోరడేమో… జాలిగ చూస్తుంటడో
గల్లీ చిన్నది… ||గల్లీ||

పర్సుకున్న పట్టపై… పాణాలు పెట్టుకుంటడో
డొక్కు స్కూటరొస్తదని… దిక్కులు చూస్తుంటడో
గల్లీ చిన్నది… ||గల్లీ||

నడుములొంచి దొబ్బేటి… నాలుగు గిర్రల బండిరా
ఉల్లిగడ్డ అమ్మితేనే… కడుపుల కునుకొస్తదో
గల్లీ చిన్నది… ||గల్లీ||

మూడు జానల పోరడు… వాని బాధలేమో బారెడు
వాడు జేసె దంద సారెడు… వానికేడ తీరు బాధలు
గల్లీ చిన్నది… ||గల్లీ||

కాలేకడుపుకాసరా గాలి బుడుగలమ్ముడు…
పిన్నీసులు రిబ్బన్లు… కన్నీరును తూడ్సునా
గల్లీ చిన్నది… ||గల్లీ||

కల్లుపాక, ఎల్లమ్మ గుడి… కలుసుకోని ఉంటావీ
తాగినోళ్ళు ఊగుకుంట… రాగమెత్తుతుంటరో
గల్లీ చిన్నది… ||గల్లీ||

ఇరుకుఇంట్ల నరకమై… వీధులల్లకొస్తరో
పోరలేమో దుమ్ములోన… పొర్లాడుతుంటరో
గల్లీ చిన్నది… ||గల్లీ||

కోరి కోరి వారముల… కూర తెచ్చుకుంటరో
పుదీనా కొత్తిమీర… దాంట్ల కలుపుకుంటరో
గల్లీ చిన్నది… ||గల్లీ||

అల్లమెల్లిపాయ దంచి… మసాల దట్టించిన
మోరి గాలి వాసనకు… కూర కంపు కొడ్తదో
గల్లీ చిన్నది… ||గల్లీ||

దువ్వుకునే దువ్వెన… పళ్లిరిగిపోయి ఉంటది
ఎవ్వరింట్ల చూసినద్ధము… ఎందుకో పగిలుంటది
గల్లీ చిన్నది… ||గల్లీ||

సిత్తు బొత్తు బతుకులూ… సిన సిన దందలు
సిల్లర కొట్లల్ల వాళ్ళు… చిన్న ఖాతా పెడ్తరో
గల్లీ చిన్నది… ||గల్లీ||

ఏండ్లకేండ్లు గడిసెరా… ఎడ్డి బతుకులింతేరా
ఎవరేలినగాని గల్లి రూపమేమి మారేరా…
గల్లీ చిన్నది…

గల్లీ చిన్నది… గరీబోళ్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇండ్లు… కిళ్ళీ కొట్ల కన్నా సిన్నగున్నవి
గల్లీ చిన్నది…

“galli chinnadi” Song Video

dhinkachika

Dhinkachika – Lyrical | Mem Famous | Sumanth Prabhas | Kalyan Nayak | Chai Bisket Films|Lahari Films

Song Info

Singer Kalyan Nayak
Lyrics Koti Mamidala
Kalyan Nayak
Mix Assist Aditya.G, thesounddock studios, Hyderabad
Music Label Lahari Music

“Dhinkachika” Song Lyrics

హె మామా మామా… రారా మామా
రచ్చే ఫుల్లు… వచ్చేయ్ మామా
దావత్ ఉంది చిల్ అవుదామ
గత్తర్ గత్తర్ చేద్దామా

హె మామా మామా… రారా మామా
రచ్చే ఫుల్లు… వచ్చేయ్ మామా
దావత్ ఉంది చిల్ అవుదామ
గత్తర్ గత్తర్ చేద్దామా

కల్లు సుక్క చికెన్ ముక్క
బోటి కూర ఇంకో పక్క
కిక్కే ఎక్కి కక్కే దాకా
డీజే పెట్టి మొగాలింకా

హె ఊరు వాడ ఈడ్నే మకాం
చిన్న పెద్ద అంతా వెల్కమ్
దావత్ అంటే ఇట్టే ఉంటది
ధూం ధాం చేద్దాం

సుక్కలు తెంపి లైటింగ్ ఏద్దాం
సక్కని పిల్లకి సైటే కొడదాం
పీకల దాక బొక్కలు మెక్కి
ఎంజాయ్ చేద్దాం

అరె దావత్ అంటే తీన్మార్
ఆడాలింకా జోర్ధార్
దినాం దినం గింత గనం
దావత్ ఉండదు బార్ బార్

అన్న పెంచు ఇంకా బేస్
ఊగాలింకా ఊర మాస్
ఏదేమైనా ఎట్టాగైనా
దావత్ నైతే చేద్దాం ఫేమస్

డింకచిక చిక చిక
డింకచిక చిక చిక
డింకచిక చిక చిక
చల్ మేమ్ ఫేమస్

అరే పిజ్జాలు బర్గర్లు వద్దే వద్దు పాష్
ఈ కల్లు గుడాలు చల్ లోకల్ ఫేమస్
అరె పబ్బుల్లో పబ్లిక్కు ఏముంటది రష్
చుట్టు మనవాల్లైతే చాలు దిల్లే కద కుష్

అరె ఇట్ట పుట్టి అట్ట పోతే
లైఫే పెద్ద లాస్
మంచో చెడో మళ్ళా ఇల్లా
మజా చేస్తే మాస్

సైడే వచ్చి మూడే పోతే
డల్లైపోదా ఫేస్
అయినా కూడా చిల్లౌతుంటే
అదే కదా మాస్

హే రా రా చిల్లైపోరా
బాదల్ గీదల్ మర్చే పోరా
దావత్ అంటే గింతే ఉంటది
అంతా ఫుల్ మాస్

దావత్ అంటే ముందే ఉంటాం
తాపేటోడు మాకే సుట్టం
తాగే దాకా ఏది ముట్టం
ఓన్లీ బాటిల్స్

అన్న పెంచు ఇంకా బేస్
ఊగాలింకా ఊర మాస్
ఏదేమైనా ఎట్టాగైనా
దావత్ నైతే చేద్దాం ఫేమస్

డింకచిక చిక చిక
డింకచిక చిక చిక
డింకచిక చిక చిక
చల్ మేమ్ ఫేమస్

“Dhinkachika” Song Video